
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.