Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూత

మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వాటికన్ సిటీలో మరణించారు. బెనెడిక్ట్‌ 9ఏళ్ల క్రితం పోప్ పదవికి రాజీనామా చేశారు. జర్మనీలో జోసెఫ్ రాట్‌జింగర్‌గా జన్మించిన బెనెడిక్ట్.. 2005లో పోప్ పదవికి ఎంపికయ్యారు. పోప్‌గా మారిన సమయంలో ఆయనకు 78 ఏళ్లు.

పోప్ బెనెడిక్ట్ XVI 2013లో పోప్‌ పదవికి రాజీనామా చేసి కేథలిక్ క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పోప్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో బెనెడిక్ట్‌ ప్రకటించాడు. దాదాపు 600 ఏండ్లలో పోప్ పదవి నుంచి ఇలా అర్ధాంతరంగా వైదొలగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈయన కంటే ముందు 1415లో క్రైస్తవుల రెండు గ్రూపుల మధ్య ఘర్షణల కారణంగా గ్రెగొరీ XII రాజీనామా చేశారు.