రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్ శర్మ కన్నుమూత

రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్ శర్మ కన్నుమూత

హైదరాబాద్, వెలుగు: ప్రసార భారతి మాజీ సీఈవో, రిటైర్డ్ ఐఏఎస్​కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (80) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.శనివారం హైదరాబాద్ లో ఆయన కన్నుమూశారు. కేఎస్ శర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్​అధికారి అయిన కేఎస్​శర్మ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా, ఆ తర్వాత ప్రసార భారతి సీఈఓగా 2006 వరకు సేవలు అందించారు. 

దూరదర్శన్.. డైరెక్ట్ టు హోమ్, డీడీ డైరెక్ట్ ప్లస్ లాంటి సేవలను చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి కరీంనగర్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. కేఎస్​శర్మ అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసార భారతి సీఈఓ,  వెంకటేశ్వర భక్తి చానల్ వ్యవస్థాపక సీఈఓ, మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు కార్యాలయంలో ముఖ్య అధికారిగా, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఆయన సేవలు అందించారు.