బుక్ ఫెయిర్ మాజీ కార్యదర్శి విభా భారతి మృతి

బుక్ ఫెయిర్ మాజీ కార్యదర్శి విభా భారతి మృతి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పూర్వ కార్యదర్శి విభా భారతి(74) బుధవారం కాచిగూడలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో హిందీ సాహిత్య పుస్తకాలకు కేంద్రంగా మిలింద్‌ ప్రకాశన్‌ సంస్థను భర్త శృతికాంత్‌తో కలిసి 40 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల హిందీ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

 ప్రముఖ తెలుగు సాహితీవేత్త, కవి ఆలూరి బైరాగి వంటి ప్రముఖుల సాహిత్యాన్ని హిందీలో అచ్చు వేశారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్య నిర్వాహక సభ్యురాలిగా, సంయుక్త కార్యదర్శిగా పలుమార్లు పనిచేశారు.