బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ ఇవ్వాలె..టీఆర్పీ చీఫ్ తీర్మార్ మల్లన్న

బీసీలకు లక్షకోట్ల బడ్జెట్ ఇవ్వాలె..టీఆర్పీ చీఫ్ తీర్మార్ మల్లన్న

వరంగల్: రాష్ట్రప్రభుత్వం బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాజ్యా ధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇవాళ వరంగల్ లో జరిగిన రాష్ట్ర కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయా లు తీసుకున్నట్టె తెలిపారు. 

బీసీలు 42% ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోందని సరికాదని అన్నారు. తాము ఎంత జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రాలేదని, పార్టీయే తనను బయటికి పంపిందని మల్ల న్న అన్నారు. 

పార్టీ ఫిరాయంపు ఎమ్మెల్యేల అంశం ముగిసిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచిస్తానని చెప్పారు. తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ ను గుర్తించాలని అన్నారు. తెలంగాణ కోసం కష్టపడిన కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీనీ మా పార్టీలో విలీనం చేస్తా మంటే ఒప్పుకుంటామని మల్లన్న చెప్పారు. కాంగ్రెస్ మహేశ్ కుమార్, రేవంత్ రెడ్డిలపార్టీ కాదని అన్నారు. రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని మండిపడ్డారు. వరంగల్ నుం తెలంగాణ రెండో రాజధానిగా ప్రకటించాల ని డిమాండ్ చేశారు. 

భూమిలేని బీసీ కుటుం బాలకు 2 ఎకరాల చొప్పున పంపిణీ చెయ్యా లని అన్నారు. ఇండ్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇండ్లు కట్టి ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు.