మధుసూదనాచారి కొడుకుపై హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు

మధుసూదనాచారి కొడుకుపై హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కొడుకు ప్రదీప్ కుమార్ తనను బెదిరించారంటూ హైకోర్టు న్యాయవాది నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ప్రయాణిస్తున్న కారును బేగంపేట ఫ్లైఓవర్ పై గుర్తుతెలియని దుండగులు ఢీ కొట్టారని తెలిపారు.  

పద్దతి మార్చుకోకపోతే అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారని బేగంపేట పోలీసులను నరేష్ ఆశ్రయించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా లైవ్ డిబేట్స్, కోర్టుల్లో పిటిషన్లు వేయొద్దని హెచ్చరించారని ఫిర్యాదు చేశారు. ప్రదీప్ కుమార్ లైసెన్స్ ను నరేష్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.