తెలంగాణలో యూరియా కొరత మొదలైంది: మాజీ స్పీకర్​ పోచారం

తెలంగాణలో యూరియా కొరత మొదలైంది: మాజీ స్పీకర్​ పోచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ యూరియా కొరత మొదలైందని.. చెప్పులు లైన్​లో పెట్టి యూరియా బస్తాలు తీసుకొవాల్సిన పాలన వచ్చిందని మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్​ లోక్​సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం తెలంగాణ భవన్​లో మీడియాతో పోచారం మాట్లాడారు. పోలీస్ ​స్టేషన్​లో యూరియా బస్తాలు అమ్మాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందన్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అవుతున్నా.. సమీక్షలతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. పాత పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పథకాల ఊసే లేదని చెప్పారు. నెల రోజుల్లోనే వ్యతిరేతను మూటగట్టుకున్నా ప్రభుత్వం ఇదేనన్నారు.