
శ్రీలంక మాజీ ప్రధాని మహిందా రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చింది. దేశం విడిచిపోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ ఆర్థికమంత్రి బాసిల్ రాజపక్స కూడా జులై 28 వరకు దేశం బయటకు అడుగుపెట్టొద్దని కోర్టు ఆదేశించినట్లు డైలీ మిర్రర్ కథనం ప్రచురించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పాలనపై ఆగ్రహంతో ఉన్న జనం నిరసనతో హోరెత్తించారు. దీంతో ఆయన మాల్దీవులకు పారిపోయారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని మహిందా రాజపక్స, గొటబాయ సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్స దేశం నుంచి పారిపోయే అవకాశం ఉండటంతో వారిని నిలువరించేలా ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శ్రీలంక వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.
Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror
— ANI (@ANI) July 15, 2022
(File photos) pic.twitter.com/xg290lfmLX