ACB అదుపులో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు

ACB అదుపులో నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు

నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం (జూలై15) ఉదయం బంజారాహిల్స్ లోని ఆయన నివాసం మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

మరోవైపు మురళీధర్ రావుకు సంబంధించిన ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లలో 10 చోట్ల మురళీధర్ రావుకు చెందిన ఇండ్లలో సోదాలు చేశారు యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు.