బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో అందరూ తెలుసుకోవాలె

బంగ్లాదేశ్ ఎలా ఏర్పడిందో అందరూ తెలుసుకోవాలె

హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉన్నా దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పాక్ తో యుద్ధం తదితర విషయాల గురించి రేవంత్ తోపాటు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో ఇందిర కీలక పాత్ర పోషించారని రేవంత్ అన్నారు. ఇందిరా గాంధీ లాంటి సాహసమైన నాయకుల గురించి నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 

తూర్పు పాకిస్థాన్ లో పాక్ అకృత్యాలు పెరిగిపోవడంతో ఇందిరా గాంధీ సాహసోపేతంగా దాయాదిపై యుద్ధానికి దిగారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పాక్ భూభాగంలో 15 వేల చదరపు కిలో మీటర్లను ఆక్రమించుకున్న భారత్.. దాదాపు 93 వేల మంది పాక్ సైనికులను బందీ చేసిందన్నారు. కేవలం 13 రోజుల్లోనే పాకిస్థాన్ ను పూర్తిగా ఓడించి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేయగలిగిందన్నారు. ఆ సమయంలో ఇండియాపై అగ్రారాజ్యం అమెరికా సహా పలు దేశాలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా, భయపెట్టినా.. ఇందిర బెదరలేదన్నారు. ప్రపంచ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ హిస్టరీలో ఇదో సువర్ణాధ్యాయం అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఆటోవాలా ఇంటికి సీఎం.. నేలపై కూర్చొని భోజనం

కేసీఆర్ కు ఇంకా దొరకని మోడీ అపాయింట్మెంట్!

వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని కత్తెరతో..