కాకా ఫౌండేషన్ చేయూత..పేదలకు నిత్యావసరాల పంపిణీ

కాకా ఫౌండేషన్ చేయూత..పేదలకు నిత్యావసరాల పంపిణీ

బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ సేవలు మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ మొదలయినప్పటి నుంచి పేదలు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను నిరాటంకంగా అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో 60 మంది పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇల్లు గడవడానికి ముస్లిం కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను, రంజాన్ పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితిని స్థానికంగా ఉన్న అనుచరులు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వివేక్ తన తండ్రి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా రంజాన్ పండుగ కు కావాల్సిన సరుకులతో పాటు నిత్యావసర వస్తువులను పంపించారు. వాటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, వివేక్ అనుచరులు సతీష్ గౌడ్, షకీల్ ముస్లిం కుటుంబాలకు అందజేశారు.

లాక్ డౌన్ ఎఫెక్ట్..పెండ్లి ఖర్చులు తగ్గినయ్