చైనా కంటే మనమే బలంగా ఉన్నాం

చైనా కంటే మనమే బలంగా ఉన్నాం

హైదరాబాద్‌‌, వెలుగు: చైనాది ఆక్రమణ కాదు.. దండయాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పల్లంరాజు అన్నారు. చైనా కంటే మనం బలంగా ఉన్నామని చెప్పారు. యుద్ధం వస్తే రెండు వైపులా నష్టమని, అది రెండు దేశాలకూ తెలుసన్నారు. శుక్రవారం ఆయన వీ6తో మాట్లాడుతూ.. చైనా కంటే మనం బలంగా ఉన్నామని చెప్పారు. కరోనా నిందను తప్పించుకునేందుకే ఇదంతా చేస్తోందన్నారు. దౌత్యపరంగా ప్రెషర్‌‌ పెట్టాలని చూస్తోందని, దీని ద్వారా ఇక్కడున్న ఇతర దేశాలు లైన్‌‌లోకి వస్తాయని చైనా భావిస్తోందన్నారు. రీజియన్‌‌లో బలంగా ఉన్నామని చెప్పడానికే ఇదంతా చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆ దేశం యాటిట్యూడ్‌‌ మారిందని, దీన్ని గట్టిగా ఎదుర్కొవాలని, స్ట్రాంగ్‌‌ డెసిషన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. బార్డర్‌‌లో మే 5వ తేదీ నాటి పరిస్థితులు మళ్లీ రావాలన్నారు. బార్డర్‌‌ ముందుకు రావడం చైనాకు అలవాటేనని, వారు బలంగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. 2013, 2014లోనూ ఇలాగే చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో టఫ్‌‌ స్టాండ్‌‌ తీసుకున్నట్లు తెలిపారు. 1993లో ఎల్‌‌ఏసీపై జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందన్నారు. లడఖ్‌‌ దగ్గర నిర్మాణంపై చైనా అసంతృప్తిగా ఉందని, సరిహద్దు విషయంలోనూ అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. లడఖ్‌‌లో డామినేషన్ కోసం ప్రయత్నిస్తోందని, దీంతో తమకు థ్రెట్ ఉండదని భావిస్తోందన్నారు. హంకాంగ్‌‌, తైవాన్‌‌తో చైనాకు ఇప్పటికే గొడవలు ఉన్నాయని గుర్తు చేశారు.

చైనాది ఆక్రమణ కాదు.. దండయాత్ర

ఆర్మీని బలోపేతం చేయడానికి యూపీఏ హయాంలో చర్యలు తీసుకున్నామని, 100 శాతం రక్షణ బడ్జెట్‌‌ను ఖర్చు చేసినట్లు పల్లం రాజు చెప్పారు. బషోలి బ్రిడ్జికి యూపీఏ హయాంలోనే శంకుస్థాపన చేశామని, 2006లో ఈశాన్య రాష్ట్రాల్లో వసతులు పెంచామన్నారు. గతంలో అనేక సార్లు చైనాతో గట్టిగా పోరాడామని చెప్పారు. ప్రస్తుతం లాంగ్‌‌ టర్మ్‌‌ అబ్జెక్టివ్‌‌తో బీజేపీ ప్రభుత్వం ముందుకు పోవడంలేదని, ఇది దురదృష్టకరమన్నారు. టైమ్సాంగ్‌‌ లేక్‌‌ ఏరియాలో ఫింగర్‌‌ 4 నుంచి ఫింగర్‌‌ 8వరకు వెళ్లే పరిస్థితులు లేకుండా పోవడం ఇప్పుడే జరిగిందని చెప్పారు. చైనా మన బార్డర్ ను ఆక్రమించుకుందని, ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందని విమర్శించారు. 1962లో ఆక్సాయ్‌‌ చిన్‌‌ను చైనా ఆక్రమించిందనే విషయం చాలా కాలం వరకు తెలియలేదని, రిపోర్ట్స్‌‌ వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారన్నారు. అప్పట్లో యుద్ధానికి ప్రిపేర్‌‌ అయ్యే వెళ్లారని, రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. చివరకు ఆక్సాయ్‌‌ చిన్‌‌ శాశ్వతంగా చైనాకు వెళ్లిపోయిందని చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఉందన్నారు. బార్డర్‌‌లో ఎప్పుడూ దాడులు జరుగుతుండటంతో చైనాతో పోలిస్తే మనం ప్రిపేర్డ్‌‌గా ఉన్నామని చెప్పారు.

సర్కారీ ఆస్పత్రుల్లో జ్వరం వస్తే దిక్కులేదు