బలిపీఠంపై కౌలు రైతు

బలిపీఠంపై కౌలు రైతు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు చొప్పున అన్నదాతలు అప్పుల బాధ భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 జూన్‌ నుంచి,2019 ఫిబ్రవరి వరకు 4,200 మంది రైతులు ఆత్మహత్మహత్యలకు పాల్పడినట్లు రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎస్ వీ), టాటా ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) ఇటీవల ని ర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈలెక్కలన్నీ పోలీస్‌ స్టేష న్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్ ల ఆధారంగా రూ పొందించిన డిస్ట్రిక్ట్‌ క్రైంబ్యూరో రికార్డు(డీసీబీఆర్‌)ల ప్రకారమే. ఇవికాక రిపోర్ట్‌ కాని ఆత్మహత్యలు కూడా ఉంటాయని ఆర్‌ఎస్ వీ ప్రతినిధులు వెల్లడిం చారు.

పత్తి, కౌలు రైతులే ఎక్కువ

ఐదేళ్లలో మొత్తం 4,200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వీరిలో 81.4 శాతం మంది పత్తి రైతులే కావడం గమనార్హం. బలవన్మరణానికి పాల్పడిన రైతుల్లో 700 మంది నేపథ్యాన్ని బేస్న్‌ సర్వే గా టిస్‌,ఆర్‌ఎస్వీ బృందం అధ్యయనం చేసింది. బాధిత రైతు కుటుంబాలతో వారు మాట్లాడగా.. వీరిలో 93 శాతం మంది సన్నకారు రైతులేనని తేలింది. వీరిలోనూ 520 మంది కౌలురైతులేనని అధ్యయనంలో వెల్లడైంది.నల్గొండ, సిద్దిపేటలో అధికం రాష్ట్రం ఏర్పాటై న తర్వాత 31 జిల్లాలవారీగా చూసినప్పుడు 2018 అక్టోబర్‌ వరకు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 414 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 341 మంది రైతు ఆత్మహత్యలతో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరంగల్‌ రూరల్‌ (196 ఆత్మహత్యలు), ఆదిలాబాద్‌(173), యశంకర్‌ భూపాలపల్లి(170), మెదక్‌(166) జిల్లాలున్నాయి.

పత్తి రైతుల ఆశలసాగు

ప్రత్యామ్నాయ పంటలు పండించాలని ఓవైపు రాష్ట్రప్రభుత్వం , వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు పత్తినే సా గు చేస్తున్నారు. లక్షలాదిరూపాయలు అప్పు చేసి పెట్టు బడి పెట్టి పత్తి సాగుచేస్తే నష్టాలే మిగులుతున్నాయి. అయినా మళ్లీ పత్తినేసాగు చేస్తున్నారు. అందుకు అనేక కా రణాలున్నాయి.లక్షల్లో పేరుకుపోయిన అప్పులతోపాటు పెరుగుతున్న కుటుంబ ఆర్థికా వసరాలు వారిని పత్తి సాగు వైపు నెడుతున్నాయి. తృణధాన్యాల్లాంటి పంటలు సా గు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి రాదని, ప్పులు తీర్చే స్థాయిలో డబ్బులు వచ్చే పరిస్థితి లేదని పత్తి రైతులు చెబుతున్నారు. అందుకే ఈ సా రైనా ధర రాకపోదా?పంట పండకపోదా? అనే ఆశతో మళ్లీ ఆ పంటనేసాగు చేస్తున్నట్లు పేర్కొంటు న్నారు. అలాగే తక్కువ నీరున్నా పంట డుతుందనే భావనతో కూడా రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆర్వీఎస్‌–టిస్‌ అధ్యయనంలో తేలింది.మూడేళ్లలో పత్తి సాగు ఇలా..దేశంలో పత్తి సాగు, ఉత్పత్తిలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 2014-15లో రాష్ట్రంలో 16.93 లక్షల హెక్టార్లలో పత్తి సా గుచేయగా.. 35.83 లక్షల బేళ్ల ఉత్పత్తి జరిగింది. 2015–-16లో ఈ పంట విస్తీర్ణం 17.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఆ సంవత్సరం 37.33 లక్షల బేళ్ల దిగుబడి వచ్చిం ది. 2016–-17లో సాగు విస్తీర్ణం 20 శాతాని కి పడిపోయింది. 2015-16లోమార్కెట్ లో పత్తి ధరకు గిట్టుబాటు  ధర లేకపోవడం,కూలీల ఖర్చు , పురుగుల మందుల వ్యయం పెరగడం, పత్తి ఎగుమతిపై రాయితీలను కేం ద్ర ప్రభుత్వం తొలగించడమే సా గు విస్తీర్ణం తగ్గడానికి కారణాలని ఈ అధ్యయనంలో తేలింది.

ఆత్మహత్యల పాపంలో సీడ్‌ కంపెనీల వాటా రాష్ట్రంలో సీడ్ కంపెనీలు ఏటా సుమారు కోటి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నాయి. నష్టాల్లో సీడ్‌ కంపెనీల పాత్ర తక్కువేమీ కాదంటున్నారు రైతులు. ఆత్మహత్యలకు సీడ్‌ కంపెనీలు కూడా కారణమే అని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన రైతు ఊడుగుల లింగయ్య చెప్పారు. అధిక దిగుబడులు వస్తాయంటూ ఈ కంపెనీలన్నీ బోగస్ విత్తనాలను విక్రయిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయినప్పుడు ఆ కంపెనీతో పోరాడే శక్తి లేని రైతు ఆత్మహత్య చేసు కుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పరిహారానికి ‘నో బడ్జెట్‌’ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు రైతులేని, వారు అప్పుల బాధతోనే చనిపోయారని గుర్తించినా పరిహారం ఇవ్వడంలో అధికారులు ని ర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇలా గుర్తించిన 500 మందికిపైగా రైతు కుటుంబాలకు రెండే ళ్లయినా పరిహారం అందలేదు. అన్ని స్థాయిల్లో విచారణలు పూర్తయి బాధిత కుటుంబాలకు ప్రొసీడింగ్స్‌ లెటర్లు జారీ చేసినా పరిహారంలో ఆలస్యం ఎందుకవుతోందని ఆర్టీఐ కిం ద అడిగితే ‘నో బడ్జెట్‌’అని అధికారులు సమాధానమిస్తున్నట్లు రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్‌ కొండల్‌ రెడ్డి చెప్పా రు.

కౌలు రైతు కష్టం తీ రేదెప్పుడు?కౌలురైతులకు రైతుబంధు, బ్యాంకు రుణంతోపాటు ప్రభుత్వం నుం చి ఎలాంటి సాయం అందడం లేదు.రైతుగా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో రైతు బీమా కూడా వర్తించడం లేదు. కౌలు రైతులను గుర్తించేందుకు 2011లో తీసుకొచ్చిన భూ అధీకృత సా దారుల చట్టం అమలును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని రైతుల్లో 30 శాతాని కిపైగా(సుమారు 15లక్షల మంది) కౌలు రైతులు ఉండగా వారిలో కేవలం 15 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డు లు జారీ అయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 80 శాతం మంది కౌలు రైతులే ఉంటు న్నారు. కానీ వీరు రైతులని చెప్పేందుకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో రైతు బీమా వర్తించడం లేదు.