
జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సమావేశాల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ తో పాటు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావులు గతంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన నేతలను తెలంగాణ బీజేపీ నేతలు కలవనున్నారు. అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై ఢిల్లీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఇవ్వనున్నట్టు సమాచారం.