
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చి గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు ఆపినట్టు వార్తలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై సోమవారం ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని.. కానీ, ఈ అంశాన్ని ఆలస్యం చేయడం సరికాదన్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో గత 20 నెలలుగా కేంద్రం నుంచి లోకల్ బాడీలకు రావాల్సిన రూ.2,300 కోట్ల నిధులు ఆగాయని.. దీంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
పాలకవర్గాలు ముగిసే టైమ్ లోనే ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుందన్నారు. కానీ, 2019 మున్సిపల్ చట్టంలో సెక్షన్ 195 ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉందని ఆయన లేఖలో స్పష్టం చేశారు.