
శ్రీనగర్: దాయాది పాకిస్తాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు భారత పౌరులతోపాటు ఒక బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ రాకేశ్ దోవల్ చనిపోయాడని, కానిస్టేబుల్ వాసు రాజాకు గాయాలైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తొలుత పాక్ ఫైరింగ్‌కు దిగిందని, భారత్ దీటుగా బదులిచ్చిందని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.