తెలంగాణలో ఐదుగురికి కరోనా పాజిటివ్

తెలంగాణలో ఐదుగురికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు మంత్రి ఈటెల.  రాష్ట్రంలో ఉన్న ఒక్కరికి కూడా కరోనా రాలేదన్నారు . విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వచ్చిందన్నారు. గాంధీలో పూర్తిస్థాయి కోరానా టెస్టులు చేస్తామన్నారు. పూణెకు శాంపిల్స్ పంపాల్సిన అవసరం లేదని..గాంధీలోనే కరోనా ఫైనల్ టెస్టులు చేస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్ ఉందన్నారు. రాష్ట్రానికి వచ్చే అన్ని మార్గాల్లో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. విదేశీయులను క్వారంటైన్ చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 221మందిని క్వారంటైన్ లో ఉంచామన్నారు. పాజిటివ్ వచ్చిన వారి నుంచి ఎవరికీ వైరస్ సోకలేదు. ఎయిర్ పోర్టులో 66 వేల మందికి పైగా స్క్రీనింగ్ టెస్టులు చేశామన్నారు. దుబాయ్, నెదర్లాండ్, ఇటలీ , స్కాట్ లాండ్ ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా వచ్చిందన్నారు. కరోనా లక్షణాలున్న వారిని గాంధీకి తరలిస్తున్నామన్నారు.

see more news

కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు 2 వారాల జీతం బోనస్

జిమ్ లో ఆర్య వర్కవుట్స్ ..చూస్తే షాక్ అవాల్సిందే.!

కరోనాపై ఫైట్.. WHO ‘సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్’