మేడారం జాతరకు నాలుగు రోజులు సెలవులు

మేడారం జాతరకు నాలుగు రోజులు సెలవులు

ములుగు: మేడారం మహా జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో ప్ర భుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈమేరకు జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీచేశారు. నాలుగు రోజులపాటు విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశించారు. 

మేడారం జాతర ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీ వరకు సాగనుంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశారు. రవాణా పరంగానూ తెలంగాణ ఆర్టీసీ 6వేల స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. ఈ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.