భైంసాలో కంటైనర్ ను ఢీ కొట్టిన కారు...నలుగురు అక్కడికక్కడే మృతి

భైంసాలో కంటైనర్ ను ఢీ కొట్టిన కారు...నలుగురు అక్కడికక్కడే  మృతి

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  సత్ పూల్ బిడ్జి దగ్గర కంటైనర్ ను వెనకనుంచి వస్తోన్న కారు ఢీ కొట్టింది.  ఈ ఘటనలో   కారు నుజ్జునుజ్జు అయింది.  ప్రమాద సమయంలో  కారు  డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు మృతి అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

 వీళ్లంతా హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బందువులను  పరమార్చించడానికి వెళ్ళి వస్తుండగా జనవరి 20న ఉదయం ఈ ఘటన జరిగింది . ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.  మృతులు  కుబీర్ మండలంలోని కుప్టి గ్రామస్తులు వీరిలో నూతనంగా ఏన్నికైన సర్పంచ్ కూడా ఉన్నారు.  భోజరం పటేల్42, రాజన్న(60),బాబన్న (70) ,మరొకరు డ్రైవర్ వికాస్  మృతి చెందాడు.  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగాధర్ తలకు తీవ్రగాయలు కావడంతో భైంసా ఆసుపత్రి  నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.