చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి

V6 Velugu Posted on Nov 26, 2021

కరీంనగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్ కు చెందిన ఓ ఫ్యామిలీ ఖమ్మం జిల్లా కల్లూరులో దశ దినకర్మకు వెళ్లింది.  అక్కడి నుంచి తిరిగి కరీంనగర్ కు వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. మానకొండూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా.. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిని కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల శ్రీరాజ్ గా గుర్తించారు. కొప్పుల శ్రీనివాసరావు సిరిసిల్ల  పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తుండగా.. కొప్పుల బాలాజీ పెద్దపల్లిలో అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడం గమనార్హం.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన పెంచాల సుధాకర్ రావును ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు.

Tagged Karimnagar, accident, car accident, Manakondur

Latest Videos

Subscribe Now

More News