రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో నాలుగు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మొదటి రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్​, సంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఆదివారం పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కరీంనగర్​ జిల్లా చింతకుంటలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్​ జిల్లా కేశవరంలో 2.7, వికారాబాద్​ జిల్లా యాలాల్​లో 2.3, పరిగిలో 1.8, పెద్దేముల్​లో 1.8, ఖమ్మంలో 1.7, ధారూరులో 1.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.

ALSO READ :మరో 19 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.. నేషనల్ సెమినార్​లో వక్తలు