మరో 19 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.. నేషనల్ సెమినార్​లో వక్తలు

మరో 19 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.. నేషనల్ సెమినార్​లో వక్తలు
  • భాషా ప్రయుక్త రాష్ట్రాలతోనే దేశాభివృద్ధి
  • రెండో నేషనల్ సెమినార్​లో వక్తలు

హైదరాబాద్, వెలుగు: ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల విభజనతో పరిపాలన మరింత సులభం అవుతుందన్నారు. వెంటనే మరో 19 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్​లోని గురుస్వామి సెంటర్​లో ఆదివారం సెకండ్ నేషనల్ సెమినార్ నిర్వహించారు. 

రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మెట్టా రామారావు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్​కు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ యతి రాజులుతో పాటు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతినిధులు హాజరై మాట్లాడారు. 

ALSO READ :గోవా లిక్కర్ గ్యాంగ్ అరెస్ట్.. 1,568 బాటిళ్లు సీజ్‌‌‌‌

దేశాభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలు దేశంపై పెత్తనం చెలాయిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ బలాన్ని అడ్డం పెట్టుకుని దేశంలోని వనరులను దోచుకుంటున్నాయన్నారు.