కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్..ఒకరు మృతి

కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్..ఒకరు మృతి

ముంబై నాయక్ నగర్ లో నాలుగు అంతస్తుల పాత బిల్డింగ్ రాత్రి కుప్పకూలింది. 20 నుంచి 25 మంది బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నారు అధికారులు చెబుతున్నారు. రాత్రి నుంచి శిథిలాల తొలగింపు.. రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. 8 మందిని సురక్షితంగా రక్షించారు.  సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు BMC అధికారులు.

ఘటనా స్థలానికి వెళ్లారు మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్య థాక్రే. రెస్క్యూ పనులను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న 4 బిల్డింగులకు నోటీసులిచ్చామన్నారు ఆదిత్య థాక్రే. కానీ అక్కడ నివసించే కొందరు బిల్డింగ్ ఖాళీ చేయలేదన్నారు. ప్రస్తుతం ప్రజలందరిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు ఆదిత్య థాక్రే. శిథిలావస్థలో ఉన్న బిల్డింగులకు నోటీసులు ఇవ్వగానే ఖాళీ చేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు అధికారులు.