సౌతిండియా మీడియా సమ్మిట్ సక్సెస్ :శంకర్

సౌతిండియా మీడియా సమ్మిట్ సక్సెస్ :శంకర్

చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్ లో జరిగిన  సౌతిండియా మీడియా సమ్మిట్ కార్యక్రమం తాను ఊహించిన దానికంటే  ఎక్కువ విజయవంతం అయ్యిందన్నారు  ఫోర్త్ డైమెన్షన్ మీడియా సీఈవో బి. శంకర్. ఈ సమ్మిట్ లో  ఒకే రోజు 51 మంది వక్తలు మాట్లాడం గొప్ప విషయమన్నారు ఫోర్త్ డైమెన్షన్ మీడియా సీఈవో బి. శంకర్. కార్యక్రమానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని తాను ఊహించలేదన్నారు. కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన చెన్నై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

తమిళనాడు భాష, సాంస్కృతిక శాఖమంత్రి పాండిరాజన్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించిన ఈ సమ్మిట్ ను ఫోర్త్ డైమెన్షన్ మీడియా సొల్యూషన్స్ ఏజెన్సీ వరుసగా రెండో ఏడాది నిర్వహించింది. గతేడాది 185-200 హాజరైనా ఈ కార్యక్రమానికి ఈ సారి 400 మందికి పైగా హాజరయ్యారు.  ద హిందూ గ్రూప్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సదస్సుకు వీ6 వెలుగుతోపాటు పలు మీడియా సంస్థలు కో స్పానర్స్ గా ఉన్నాయి. పలు వ్యాపార రంగాలకు చెందిన కంపెనీలు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరై దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో మార్కెట్, అడ్వర్టయిజింగ్ అవకాశాలపై తమ ఆలోచనలను పంచుకున్నారు . సమ్మిట్ లో  ఫేక్ న్యూస్, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం , డిజిటల్ కంటెంట్, మీడియా,మార్కెటింగ్ రంగాల్లో మహిళలకు సవాళ్లు,ఆరోగ్య సంరక్షణ లాంటి అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి.