తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరో హీరోయిన్స్‌గా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సాల్ నిర్మించారు. మే 1న సినిమా రిలీజ్. శుక్రవారం నాలుగో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
స్వీకార్ అగస్తీ కంపోజ్ చేయడంతోపాటు తనే స్వయంగా లిరిక్స్ రాశాడు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌గా పాడాడు. ‘ప్రేమకి పులిహోర కలిపామా ఇలాగా రాచేసి.. పెళ్లికి రూటే వేశామా మరోటి జతచేసి..’ అంటూ మోడరన్ లవ్‌లో ఉండే ఆటుపోటులను ప్రజెంట్ చేస్తూ సాగిందీ పాట. తరుణ్ భాస్కర్, మానస చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

