బెంగళూరీలకు శుభవార్త.. కొత్తగా 40వేల జాబ్స్, సిద్ధం చేసిన ఫాక్స్‌కాన్..

బెంగళూరీలకు శుభవార్త.. కొత్తగా 40వేల జాబ్స్, సిద్ధం చేసిన ఫాక్స్‌కాన్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ సంస్థ భారత విస్తరణపై కామెంట్స్ తర్వాత టిమ్‌కుక్ ఇచ్చిన మాటపై నిలబడతానని చెప్పిన మాటలు నిజమేనని ప్రస్తుతం తెలుస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను తయారు చేసే తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తన అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లింగ్ ఫ్యాక్టరీని కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని దేవనహళ్లిలో నిర్మిస్తోంది. దీనికోసం రూ.21వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతిపెద్ద అసెంబ్లింగ్ ప్లాంట్ కానుంది.

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పేరుతో దీనిని ఫాక్స్ కాన్ 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. జూన్ 2025 నాటికి ఇక్కడి నుంచి ఐఫోన్ల ఎగుమతి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫేజ్ 1 కింద రూ.3వేల కోట్లు పెట్టుబడిగా పెట్టగా.. రెండో ఫేజ్ కింద 2026-27లో ఇదే మెుత్తాన్ని ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం ఏడాది నాటికి ఈ ప్లాంట్ నుంచి లక్ష ఫోన్లను అసెంబుల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న కంపెనీ ఇందుకోసం 40వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. వీరిలో 50 నుంచి 80 శాతం ఉద్యోగ అవకాశాలను మహిళలలకు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 

Also Read : నా కొడుకు మరణానికి గూగుల్, ఏఐ కంపెనీలే కారణం

ఈ ప్రాంతంలో కంపెనీ 6నుంచి 8వేల మహిళల నివాసానికి 900 గృహాలను బీసీడీ రియల్టీ కంపెనీ నుంచి లీజుకు తీసుకున్నట్లు వెల్లడైంది. పైగా ఈ ప్రాంతంలో ఉద్యోగుల అవసరాల కోసం అవసరమైన స్కూళ్లు, ఆరోగ్య సేవలు, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ జోన్స్ అందుబాటులో ఉన్నాయి. చైనాపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది. పైగా ఇప్పటికే విల్‌స్ట్రన్, పెగట్రాన్‌లను కొనుగోలు చేసిన టాటాలతో కూడా కంపెనీ కలిసి పనిచేస్తోంది.