నా కొడుకు మరణానికి గూగుల్, ఏఐ కంపెనీలే కారణం.. కోర్టుకెళ్లిన తల్లి, ఏమైందంటే?

నా కొడుకు మరణానికి గూగుల్, ఏఐ కంపెనీలే కారణం.. కోర్టుకెళ్లిన తల్లి, ఏమైందంటే?

Google: ఆధునిక యుగంలో ఏఐ రాకతో జీవితాలు మారిపోతున్నాయి. ఇది కొందరి జీవితాలను సానుకూలంగా మెరుగుపరుస్తుండగా.. మరికొందరి జీవితాలను నాశనం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రజలు దానిని ఎలా ఎంత వరకు అర్థం చేసుకుని ముందుకెళుతున్నారనే అంశం కూడా చాలా ముఖ్యమైనది.

తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్కియ తన కుమారుడి మరణానికి గూగుల్, దాని ఏఐ స్టార్టప్ కంపెనీ క్యారెక్టర్.ఏఐ కారణమంటూ కోర్టుకు వెళ్లింది. వీటి కారణంగానే తన 14 ఏళ్ల కుమారుడు 2024 ఫిబ్రవరిలో ఆమె పేర్కొంది. అయితే అతడు మరణించటానికి ముందు ఏఐ చాట్‌బాట్ తో మెసేజింగ్ చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వాస్తవానికి పిల్లలను మానసిక హాని నుండి రక్షించడంలో విఫలమైనందుకు ఏఐ కంపెనీపై నమోదైన మెుదటి కేసు ఇదని తెలుస్తోంది.

సెవెల్ సెట్టర్ AI-ఆధారిత చాట్‌బాట్‌తో వ్యామోహం పెంచుకున్న తర్వాతఆత్మహత్య చేసుకున్నాడని దావాలో పేర్కొన్నారు. ప్రస్తుత కేసుతో మేల్కొన్న ఏఐ సంస్థ మైనర్లను రక్షించటానికి తమ ప్లాట్‌ఫామ్‌లో భద్రతా చర్యలను ఉపయోగిస్తోందని.. అలాగే స్వీయ-హాని గురించి సంభాషణలను నిరోధించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. చాట్‌బాట్‌ల అవుట్‌పుట్ రాజ్యాంగబద్ధంగా రక్షించబడిన స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే న్యాయమూర్తి ఈ వాదనలతో ఏకీభవించలేదు. అలాగే ఏఐ, టెక్ పర్యావరణంలో చట్టపరమైన జవాబుదారీతనం తీసుకురావాల్సిన అవసరాన్ని ఇది నొక్కిచెబుతోందని అన్నారు. 

Also Read : సోషల్ మీడియా స్టాక్ మోసాలకు దూరంగా ఉండండి

వాస్తవానికి క్యారెక్టర్.ఏఐ సంస్థను ఇద్దరు మాజీ గూగుల్ ఇంజనీర్లు స్థాపించారు. తర్వాత వారిని గూగుల్ తిరిగి నియమించుకుంది. ఈ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా టెక్ దిగ్గజానికి స్టార్టప్ టెక్నాలజీకి లైసెన్స్ మంజూరు చేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఏఐ టెక్నాలజీల భారిన పడి అదే నిజమైన ప్రపంచంగా ఫీలవుతున్న చాలా మంది జెన్ జీ యువత తమ ప్రాణాలను కూడా కోల్పోతున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మెటా, స్నాప్‌చాట్, టిక్‌టాక్, డిస్కార్డ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల వల్ల తమ పిల్లలకు హాని జరిగిందంటూ అనేక మంది కేసులు పెట్టిన సంగతి తెలిసిందే