సోషల్ మీడియా స్టాక్ మోసాలకు దూరంగా ఉండండి: సెబీ

సోషల్ మీడియా స్టాక్ మోసాలకు దూరంగా ఉండండి: సెబీ

న్యూఢిల్లీ:    వెరిఫై కాని వ్యక్తుల నుంచి వచ్చే అన్‌‌‌‌సొలిసిటెడ్ (అడగకుండా వచ్చే)  మెసేజ్‌‌‌‌ల గురించి సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది.  వాట్సాప్ గ్రూప్స్ లేదా కమ్యూనిటీస్‌‌‌‌లో జాయిన్ అవ్వొద్దని తెలిపింది.  సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌తో  ఇన్వెస్టర్లను ఆకర్షించి,  మోసం చేస్తున్న  కేసులు పెరుగుతున్నాయి. వీటి బారిన పడొద్దని పేర్కొంది.  

‘‘మోసగాళ్లు  ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందడానికి వివిధ స్ట్రాటజీలను ఉపయోగిస్తారు. సాధారణంగా, “వీఐపీ గ్రూప్” లేదా “ఫ్రీ ట్రేడింగ్ కోర్సులు” వంటి పేర్లతో  వాట్సాప్ గ్రూప్స్‌‌‌‌ ఏర్పాటు  చేసి వీటిలో  జాయిన్ అవ్వమని అన్‌‌‌‌సొలిసిటెడ్ ఇన్విటేషన్స్ లింక్స్  పంపుతారు. నమ్మకస్తులుగా  కనిపించడానికి మార్కెట్ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటూ  ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.  

చాలా సార్లు, సెబీ- రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్, ప్రముఖ పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్, లేదా పెద్ద ఆర్గనైజేషన్స్ సీఈఓలు, ఎండీలను  ఇమిటేట్ చేస్తారు.  గ్రూప్‌‌‌‌లోని ఇతర మెంబర్స్ (వీళ్లు స్కామ్‌‌‌‌లో సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తారు) భారీ ప్రాఫిట్స్ సంపాదించినట్లు ఫేక్ ప్రూప్స్‌‌‌‌ చూపిస్తారు. ఇలా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తారు.  అదే స్థాయిలో హై రిటర్న్స్ ఇస్తామనే  హామీలు ఇస్తారు.  

వీళ్ల బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌కు డబ్బు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయాలని అడుగుతారు” అని సెబీ వివరించింది.  “అందుకే వెరిఫై కాని వ్యక్తుల నుంచి వచ్చే అన్‌‌‌‌సొలిసిటెడ్ మెసేజ్‌‌‌‌లను నమ్మవద్దు.  అలాంటి వాట్సాప్ గ్రూప్స్/కమ్యూనిటీస్‌‌‌‌లో జాయిన్ అవ్వొద్దు. సెబీ- రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్‌‌‌‌తో మాత్రమే డీల్ చేయండి. నమ్మదగ్గ ట్రేడింగ్ యాప్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయండి” అని సలహా ఇచ్చింది.  

ఇన్వెస్టర్లు  ఏదైనా ఎంటిటీలో జాయిన్ అయ్యే ముందు సెబీ వెబ్‌‌‌‌సైట్ https://www.sebi.gov.in/intermediaries.html లో దాని రిజిస్ట్రేషన్ స్టేటస్ వెరిఫై చేయాలని సూచించింది.