
- స్పందించి న్యాయం చేయండి
- స్ప్రింగ్ సిటీ మూడో ఫేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: తాము కొన్న వెంచర్‌ను పూర్తిగా అభివృద్ధి చేయని సంస్థపై చర్యలు తీసుకుని, వెంచర్‌కు ఫైల్అప్రూవ్ఇప్పించాలని స్ప్రింగ్ సిటీ మూడో ఫేజ్వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ఆర్ కే ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై రెరాకు కూడా ఫిర్యాదు చేశారు. 2018 లో స్ప్రింగ్ సిటీ పేరుతో అమీన్ పూర్మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని సర్వే నంబర్ 434,435,436,437,438,449,444,446లోని 20 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లు అంటూ వీఎన్కన్స్ట్రక్షన్స్వెంచర్వేసి ప్లాట్స్ అమ్మారని, సాండ్ స్టోన్ అనే సంస్థ ద్వారా మార్కెటింగ్చేశారన్నారు.
2018లో తామంతా రూ. లక్షలు వెచ్చించి ప్లాట్స్ కొన్నామన్నారు. ఎల్పీ నంబర్ పై ప్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసి కూడా ఇప్పటివరకు వాటిని డెవలప్చేయలేదన్నారు. చాలా సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఈ వెంచర్ లో ఉన్న పార్కు కూడా ఆక్రమణకు గురవుతోందని, 120 మంది ప్లాట్ ఓనర్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే డెవలపర్, మార్కెటింగ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.