ఫేక్ కోవిన్ యాప్​తో ఫ్రాడ్

V6 Velugu Posted on Jun 03, 2021

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో మొబైల్​ లింక్స్ పంపుతున్న సైబర్ క్రిమినల్స్
 క్లిక్ చేస్తే కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ హ్యాక్ అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలంటున్న పోలీసులు

‘‘నాంపల్లి రెడ్‌‌‌‌‌‌‌‌హిల్స్‌‌‌‌‌‌‌‌ కాలనీకి చెందిన అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొబైల్​కు రెండు రోజుల కిందట ఓ మెసేజ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 18 ఏండ్లు దాటిన వారు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ అందులో ఉంది. అమీర్ మెసేజ్​లోని  లింక్​ను క్లిక్ చేశాడు. ఆ మెసేజ్ తన కాంటాక్ట్ లిస్ట్​లోని ఓ నంబర్​కు ఫార్వర్డ్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చిన అమీర్ ఫేక్ లింక్ గురించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.’’

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: ఫేక్ కోవిన్ యాప్స్ లింక్స్​ను క్రియేట్ చేసి సైబర్ క్రిమినల్స్ మొబైల్ డేటాను హ్యాక్ చేస్తున్నారు. దొంగిలించిన డేటాను డార్క్ వెబ్ సైట్స్​కు అమ్ముతున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాకముందు నుంచే ఫేక్‌‌‌‌‌‌‌‌ కోవిన్ యాప్స్‌‌‌‌‌‌‌‌ లింక్స్ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో సర్క్యూలేట్‌‌‌‌‌‌‌‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో  కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. కొవిడ్‌‌‌‌‌‌‌‌ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌’ను క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసి ఒరిజినల్ కోవిన్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లోనే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచించింది.
 లింక్స్ క్లిక్ చేస్తే మెసేజ్ ఫార్వర్డ్
కరోనా వ్యాక్సినేషన్​ను టార్గెట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఫేక్ కోవిన్ యాప్స్ ను క్రియేట్ చేస్తూ వాటిని సోషల్ మీడియలో సర్క్యూలేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు 18 ఏండ్లు దాటిన వారు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని, ఇందు కోసం కోవిన్ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలంటూ ఫేక్ లింక్స్​ను బల్క్ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్స్​కు పంపుతున్నారు. ఈ లింక్  ఓపెన్ చేసిన వారికి ఏపీకే(ఆండ్రాయిడ్ ప్యాకేజ్) ఫైల్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వారి ఫోన్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ డేటాను హ్యాక్ చేస్తున్నారు. దీంతో పాటు లింక్‌‌‌‌‌‌‌‌ క్లిక్‌‌‌‌‌‌‌‌ చేసిన వారి మొబైల్ కాంటాక్ట్ నంబర్స్​కు ఫేక్ కోవిన్ లింక్ ఫార్వర్డ్ అయ్యేలా ప్రోగ్రామ్ డెవలప్ చేశారు.
ఫేక్ లింక్స్​ను క్లిక్ చేయొద్దు 
కోవిన్ పేరుతో చాలా ఫేక్ యాప్స్‌‌‌‌‌‌‌‌ సోషల్​మీడియాలో సర్క్యూలేట్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. కోవిన్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ పేరుతో వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌లోని లింక్స్ క్లిక్‌‌‌‌‌‌‌‌ చేయొద్దు. ఏపీకే ఫైల్ డౌన్​లోడ్​ చేయడం మంచిది కాదు. ఫేక్ లింక్స్​తో సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ నంబర్​ను తెలుసుకునే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ కోసం ఒరిజినల్ కోవిన్ యాప్, ఆరోగ్య సేతు, ఉమాంగ్​యాప్​లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.                    – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్
 

Tagged Hyderabad, POLICE, crime, fraud, , Fake Covin App

Latest Videos

Subscribe Now

More News