ఓయూ, వెలుగు: కాకతీయ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఫ్రీగా సివిల్స్కోచింగ్ఇస్తున్నట్లు ఆల్మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామ సైదులు తెలిపారు. అకాడమీ ఆధ్వర్యంలో 50 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామని, ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు అమర్నాథ్పర్యవేక్షణలో క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 91605 71483 ,91823 99858లో సంప్రదించాలని సూచించారు.
