కోమోర్బిడిటీస్ పిల్లలకు ఫ్రీగా కొవిడ్​ వ్యాక్సిన్

కోమోర్బిడిటీస్ పిల్లలకు ఫ్రీగా కొవిడ్​ వ్యాక్సిన్
  • అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కోమోర్బిడిటీస్ పిల్లలకు ఫ్రీగా కొవిడ్​ వ్యాక్సిన్​ వేయనున్నట్లు అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. కోమోర్బిడిటీస్​తో బాధపడే పిల్లలకు టీకాలు వేసేందుకు త్వరలో ఆమోదం దొరుకుతుందని, ఆ వెంటనే ప్రభుత్వ రూల్స్​ మేరకు వేస్తామని సోమవారం సిటీలో ఏర్పాటు చేసిన ఓ మీటింగ్​లో ఆయన పేర్కొన్నారు. కోమోర్బిడిటీస్ జాబితాలో హెమటోలాజికల్, న్యూరోలాజికల్, కార్డియాక్, లివర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, రుమాటిక్, క్యాన్సర్, జేనిటూరనిరీ, డెవలప్ మెంట్ డిజార్డర్ వంటి జబ్బులు ఉంటాయన్నారు. ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు కొవిడ్ సోకితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. తీవ్ర ఇన్ఫెక్షన్లతో బారిన పడతారని, కొవిడ్ కు వ్యతిరేకంగా పిల్లలు, కౌమార దశ యువకులను కాపాడేందుకు టీకా ప్రోగ్రామ్​ఎంతగానో సాయపడుతుందన్నారు. కాగా 2–18 ఏళ్ల వయసు వారికి కోవాక్సిన్, 12–18 ఏళ్ల లోపు వారికి  జైకోవ్ డీ టీకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.