ఉచిత వాక్సిన్ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదు: ఈసీ

 ఉచిత వాక్సిన్ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదు: ఈసీ

బీహార్ లో బీజేపీ ఇచ్చిన ఉచిత వాక్సిన్ హామీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం (EC). సమాచార హక్కు కార్యకర్త సాకేత్‌ గోఖలే కోరిన సమాచారం పై ఈసీ స్పందిస్తూ ఈ సమాధానం ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్‌-VIIIలో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత వాక్సిన్ హామీ ఉల్లంఘించడం లేదని ఈసీ వివరించింది. ఆదేశిక సూత్రాల ఆధారంగా ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఎలాంటి సమంజసమైన హామీలనైనా మేనిఫెస్టోలో చేర్చవచ్చని గుర్తుచేసింది.

బీజేపీ ఇచ్చిన ఉచిత వాక్సిన్ హామీ వివక్షాపూరితంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ గోఖలే ఆరోపించారు. దీనిపై ఈసీ తాజాగా ఇచ్చిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.బీజేపీ కేవలం ఒక్క రాష్ట్రానికే ఈ హామీ ఇచ్చిందన్న విషయాన్ని ఈసీ విస్మరించిందని ఆరోపించారు

బీహార్ లోఅధికారంలోకి వస్తే కరోనా వాక్సిన్ ఫ్రీగా ఇస్తామని అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర మంత్రి,  బీజేపీ సీనియర్‌ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షాల నేతలు తీవ్రంగా విమర్శించారు. ఒక్క బీహార్ కే  వ్యాక్సిన్‌ అందజేస్తే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.