కేంద్ర మాజీ మంత్రి కాకా జ్ఞాపకార్థం..మందమర్రిలో చలివేంద్రం ఏర్పాటు

కేంద్ర మాజీ మంత్రి కాకా జ్ఞాపకార్థం..మందమర్రిలో చలివేంద్రం ఏర్పాటు

కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి జ్ఞాపకార్థం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పాతబస్టాండ్​ఏరియాలో గురువారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ రాష్ట్ర లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానంద యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు, పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం కాకా వెంకటస్వామి జీవితకాలం కృషి చేశారన్నారు. 

కాకా ఆడుగుజాడలో ఆయన కుమారులు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్, మనవడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ  ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. చలి వేంద్రాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బత్తుల తిరుపతి, నాగుల దుర్గయ్య, తోట నరహరి, రామస్వామి, ఆటో యూనియన్ లీడర్ రామిరెడ్డి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.