- అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో సదస్సులు
బోథ్, వెలుగు: డ్రైవర్లకు మంచి కంటి చూపు బాగుంటేనే ప్రమాదాలను నివారించడం సాధ్యమని ఆదిలాబాద్ఎస్పీ అఖిల్మహాజన్అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బోథ్ లోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. నిపుణులైన కంటి డాక్టర్లతో 330 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేశారు.
50 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. డిఫెన్సివ్ డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జ్ఆడే గజేందర్, సీఐ డి.గురుస్వామి, ఎస్సైలు వి.పురుషోత్తం, జి.సంజయ్, ఆత్మ చైర్మన్ రాజు, సర్పంచ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా
జైపూర్, వెలుగు: సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యతని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్మండలంలోని దుబ్బపల్లి ఫంక్షన్ హాల్ ల్లో జైపూర్ పోలీస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అరైవ్ అలైవ్ ఫేజ్-3’ కార్య క్రామానికి ఆయన హాజరై మాట్లాడారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరిస్తూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ప్రజా ప్రగతి ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు నవీన్, బన్సీలాల్, కృష్ణ, ఎస్సై రాజశేఖర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్ క్రైం,వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో, ఆటో డ్రైవర్లు, ర్యాపిడో కెప్టెన్లకు ‘అరైవ్ - అలైవ్’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హజరై మాట్లాడుతూ గతేడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే రహదారుల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్స్ ’ను గుర్తించామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి , సీఐలు సంజీవ్, కుమారస్వామి, కిరణ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ లోకేశ్ , ర్యాపిడో అసోసియేట్ మేనేజర్ దుర్గారావు పాల్గొన్నారు.
