ఉచితంగా ఇంటి స్థలం : స్థలం ఉంటే రూ.5 లక్షలు

ఉచితంగా ఇంటి స్థలం : స్థలం ఉంటే రూ.5 లక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు మంత్రి భట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా.. ఇల్లు లేని వారికి ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల సాయం చేయబోతున్నట్లు స్పష్టం చేశారాయన. ఈ మేరకు అవసరం అయిన కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు వెల్లడించారు మంత్రి. 

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. ఆ నిధులను కూడా ఈ పథకం కింద ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకోవటానికి ప్రయత్నిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా.. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు కేటాయిస్తామని.. ఈ పథకానికి 7 వేల 740 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వం అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి మోసం చేసిందని.. ఆ హామీని గాలికి వదిలేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల ఆశలను నెరవేర్చటానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.