
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులకు బుధవారం ఉచిత మెడికల్ క్యాంప్ఏర్పాటు చేశామని కలెక్టర్హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. యూసుఫ్ గూడలోని కృష్ణ కాంత్ పార్క్లో ఉదయం 9 గంటల నుంచి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. వివిధ విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉంటారని, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తారని పేర్కొన్నారు.
శానిటేషన్ కార్మికులతోపాటు ఆ ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.