ఫ్రెండ్ షిప్ అంటే ఇదేగా.. స్నేహితుడు మృతి.. తట్టుకోలేక స్నేహితురాలు సూసైడ్

ఫ్రెండ్ షిప్  అంటే ఇదేగా.. స్నేహితుడు మృతి.. తట్టుకోలేక స్నేహితురాలు సూసైడ్

ఎల్బీనగర్, వెలుగు: ఓ యువకుడు తనువు చాలించడంతో తట్టుకోలేని తన స్నేహితురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. అంత్యక్రియల్లో పాల్గొని కాటి వరకు సాగనంపిన తరువాత.. తానూ అక్కడికే వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన వనస్థలిపురం పరిధిలోని శారదనగర్​లో జరిగింది. పోలీసుల వివరాల  ప్రకారం.. 

శారదనగర్ కు చెందిన పోత్నాక్ ఉమా మహేశ్వర్(17) బుధవారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా తన గదిలో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించగా అతడి స్నేహితురాలైన 16 ఏళ్ల బాలిక కూడా హాజరైంది. తన స్నేహితుడి చావును జీర్ణించుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె బుధవారం అర్ధరాత్రి ఇంట్లో చున్నీతో ఉరివేసుకుంది. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్నారు.