ఫ్రెండ్కు ఫుడ్లో మత్తుమందు కలిపి..13 తులాల బంగారం చోరీ

ఫ్రెండ్కు ఫుడ్లో మత్తుమందు కలిపి..13 తులాల బంగారం చోరీ
  • ఢిల్లీలో ఫ్రెండ్​ను ముంచిన యువకుడు

న్యూఢిల్లీ: మత్తు కలిపిన ఆహార పదార్థాలను ఓ వ్యక్తి తన స్నేహితుడికి తినిపించి బంగారాన్ని చోరీ చేశాడు. సెంట్రల్ ఢిల్లీలోని పహార్‌‌ గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులైన ప్రభ్ సింగ్, ప్రదీప్ కుమార్ పహార్ గంజ్ లోని ఓ హోటల్ లో బస చేశారు. 

జులై 8న రాత్రి ప్రభ్ సింగ్ మత్తు కలిపిన ఆహారపద్థాలను ప్రదీప్ కుమార్ కు తినిపించి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అతడి నుంచి13.40 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. స్పృహలోకి వచ్చిన ప్రదీప్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టుకుని, దొంగిలించిన ఆభరణాలను రికవరీ చేసేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. హోటల్, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, హోటల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు.