సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఫేమస్ కమెడియన్ మృతి..

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఫేమస్ కమెడియన్ మృతి..

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, కమెడియన్ మాథ్యూ పెర్రీ(Matthew Perry) శ‌నివారం (October28) లాస్ ఏంజిల్స్ లోని తన నివాసంలో అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందాడు. ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా ఎంతోమందికి పెర్రీ ఫ్రెండ్ అయ్యారు. ఎలా చనిపోయాడనేది ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. బాత్ట‌బ్‌లో పడియున్న త‌డి డెడ్‌బాడీని పోలీసులు క‌నుగోన్నారు. 

పోలీసుల కథనం ప్రకారం..మాథ్యూ పెర్రీ హార్ట్ ఎటాక్ తో చనిపోయిండొచ్చని..లేదంటే బాత్ ట‌బ్‌లో మునిగిపోయి చ‌నిపోయి ఉండొచ్చ‌ని లాస్ ఏంజిల్స్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పెర్రీ మృతిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు తెలిపారు. మాథ్యూ మ‌ర‌ణ వార్తాతో హాలీవుడ్‌లో విషాధ‌ఛాయ‌లు నెలకొన్నాయి. 

మాథ్యూపెర్రీ మృతిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ..ఒక ఫేమస్ కమెడియన్ ఈ ప్రపంచం మిస్ అవుతుంది. ఓ జనరేషన్ ఇవాళ తమ ఫ్రెండ్ ను కోల్పోయింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం. RIP' అంటూ ఇన్ స్టా లో తెలిపారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.

Also Read :- లియో మూవీపై వస్తున్న ఆ వార్తలు నిజమే

హీరోయిన్ సమంత కూడా..పెర్రీ మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ఇన్ స్టా లో వరుస పోస్టులు చేసింది. 'మాథ్యూ తన జీవితంలో ఇంతకు ముందే ఓ సారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడని..కోలన్ సర్జరీ జరిగినప్పుడు తన గుండె ఆగిపోయిందంటూ.. మాథ్యూ గతంలో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడింది. మాథ్యూ  మృతితో అతని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. 

మాథ్యూపెర్రీ 1988లో తెరకెక్కిన ఏ నైట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ జిమ్మీ రేర్డ‌న్ మూవీతో ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ఎంతో ఫేమస్ అయ్యారు. పెర్రీ ఎక్కువగా మూవీస్ కంటే వెబ్ సిరీస్ తో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. దాదాపు 20 కి పైగా హాలీవుడ్ మూవీస్ లలో నటించాడు. అతని మూవీస్ చూసుకుంటే..ది గుడ్ ఫైట్‌, సిడ్నీ, డ్రీమ్ ఆన్‌, హోమ్ ఫ్రీ, ది వెస్ట్ వింగ్‌, గో ఆన్‌, వంటి మూవీస్ లో నటించినప్పటికీ..ఫ్రెండ్స్ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటీ పొందారు.