పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో గురువారం విద్యార్థులకు పెట్టిన పొంగల్(బ్రేక్‌ఫాస్ట్)లో కప్ప వచ్చింది. గమనించిన వంట సిబ్బంది వెంటనే పొంగల్‌ను పారబోశారు. అప్పటికే అదితిన్న 45 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. నలుగురిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ గురుకులంలో 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో తహశీల్దార్రాంబాబు స్కూల్‌ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వంట సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపాల్వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
