బ్రేక్​ఫాస్ట్​లో కప్ప.. వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

బ్రేక్​ఫాస్ట్​లో కప్ప..  వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

ఇటీవల వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో సాంఘీక సంక్షేమ గురుకుల సాంఘీక సంక్షేమ గురుకుల వసతి గృహాన్ని ములుగు నియోజకవర్గ వర్గ ఎమ్మెల్యే సీతక్క పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా గత కొన్ని రోజుల క్రితం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ లో కప్ప వచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుకులంలోని విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఒక్క మాట కూడా విద్యార్థుల సమస్యలపై నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ పై ఉన్న సోయి... పేద విద్యార్థులు చదివే గురుకులంపై లేకపోయిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ గురుకుల వసతి గృహంలో బ్రేక్ ఫాస్ట్ లో కప్పలు, పురుగుల అన్నం,శిథిలావస్థలో భవనం,అశుభ్రంగా పరిసరాలు... ఇలా ఎన్నో సమస్యల నడుమ విద్యార్థుల చదువులు సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఓటు హక్కు లేనందునే వారిని పట్టించుకోవడం లేదనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఎవరెవరో స్పందిస్తున్నారు గానీ... ఆమడ దూరంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మాత్రం సోయి లేకుండా ఉన్నారని ఆరోపిస్తున్నారు.