పాత రేడియోల రిపేర్ కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌కు

పాత రేడియోల రిపేర్ కోసం అమెరికా నుంచి హైదరాబాద్‌కు

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు ఊరికే అనలేదు. అందుకేనేమో.. పాతకాలం నాటి రేడియోల రిపేర్ల కోసం మన హైదరాబాద్‌లో ఒక షాపు కూడా ఉంది. అక్కడ కేవలం పాతకాలపు మరియు పురాతన రేడియో సెట్లను మాత్రమే రిపేర్ చేస్తారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి వివిధ దేశాలకు కూడా చేరింది. దాంతో మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా.. సౌదీ అరేబియా, అమెరికా లాంటి ఇతర దేశాల నుంచి కూడా రేడియో ప్రియులు తమ వద్ద ఉన్న పాత రేడియోలతో చేరుకుంటున్నారు. ఈ షాపును మొహమ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి మెహబూబ్ రేడియో సర్వీస్ పేరుతో ఓల్డ్ సిటీలో నిర్వహిస్తున్నాడు. తమ వద్దకు వివిధ దేశాల నుంచి పాత రేడియోలు రిపేర్‌కు వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ దుకాణాన్ని నా తండ్రి 70 సంవత్సరాల క్రితం స్థాపించారు. భారతదేశం, సౌదీ అరేబియా, యూఎస్ మరియు ఇతర దేశాల నుంచి కూడా ప్రజలు తమ పాత రేడియోలను రిపేర్ కోసం మా వద్దకు తీసుకువస్తారు’ అని మొహియుద్దీన్ చెప్పారు.