ప్రేమ 14 ఏళ్లు జైలుకు పంపితే..చదువు డాక్టర్ ని చేసింది

ప్రేమ 14 ఏళ్లు జైలుకు పంపితే..చదువు డాక్టర్ ని చేసింది

కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. కర్ణాటకకు చెందిన సుభాష్ పటేల్ 1997లో ఎంబీబీఎస్ లో సీటు సంపాదించాడు. అయితే 2002లో ఓ వివాహితని ప్రేమించాడు. అయితే వారి ప్రేమను వివాహిత భర్త ఒప్పుకోలేదు. దీంతో అతన్ని  సుభాష్, వివాహిత ఇద్దరు ప్లాన్ చేసి హతమార్చారు. ఈ కేసులో నిందితులిద్దరికి 14ఏళ్ల జైలు శిక్షపడింది.  జైలు శిక్ష అనంతరం విడుదలైన నిందితుడు సుభాష్  మధ్యలోనే ఆగిపోయిన ఎంబీబీఎస్ ను పూర్తి చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా  సీటు సంపాదించి ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఎంబీబీఎస్ ను పూర్తి చేసిన సుభాష్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. క్షణికావేశంలో చేసే తప్పులు జీవితాల్ని నాశనం చేస్తాయని, అలా తప్పులు ఎవరూ చేయోద్దంటూ యువతకు సలహా ఇస్తున్నాడు.