బ్రహ్మపుత్ర నదిలో 120 కిలోమీటర్లు ఈదుకుంటూ బయట పడ్డ పులి

బ్రహ్మపుత్ర నదిలో 120 కిలోమీటర్లు ఈదుకుంటూ బయట పడ్డ పులి

గౌహతి: అస్సాంలోని ఒరంగ్​ పార్క్​ నుంచి బెంగాల్​ టైగర్ బ్రహ్మపుత్ర నదిని ఈదుకుంటూ గౌహతి దగ్గర్లోని ఓ చిన్న దీవికి చేరుకుంది. 10 గంటల పాటు ఈత కొడుతూ 120 కిలో మీటర్లు ప్రయాణించింది. నది మధ్యలో ఉన్న ఉమానంద టెంపుల్​ మీదుగా ఈత కొడుతూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మంగళవారం ఉదయం నదిలో ఈత కొడుతున్న పులిని చూసిన భక్తులు వీడియో తీశారు. దీవి ఒడ్డుకు చేరుకున్నాక బండ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులు,

ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు వచ్చి పులిని పట్టుకుని గౌహతిలోని పార్క్​కు తరలించారు. ఒరంగ్​ పార్క్​ నుంచే పులి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. బండ రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన పులిని జాగ్రత్తగా బయటకు తీశామని చెప్పారు. బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోనే ఒరంగ్​పార్క్​ ఉందని, నీళ్లు తాగేందుకు పులులు తరచూ నదీతీరానికి వెళ్తాయన్నారు. పులి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉండొచ్చన్నారు.