82 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

 82 మంది కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
  • నిర్మల్ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అక్రమాలపై విచారణ 
  • కలెక్టర్ ఆదేశాలతో ఆయా కార్యదర్శులకు నోటీసులు జారీ

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో అక్రమాలకు పాల్పడిన 80 మంది పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఐదుగురు కార్యదర్శులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

కాగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పై అందిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలన చేసి ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేశారు. 82 మంది కార్యదర్శులు పంచాయతీల్లో డ్యూటీలకు వెళ్లకుండా ఇంటినుండే యాప్ లో తప్పుడు ఎఫ్ఆర్ఎస్  నమోదు చేసినట్లు తేలింది. దీంతో వారికి షోకాజ్ నోటీసులను ఇచ్చారు.