అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఫీలవుతున్నారు.. చాలా అసహనంగా ఉన్నారు.. చాలా ఆగ్రహంతోనూ ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ ఇద్దరి వైఖరి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించారాయన. 2025, నవంబర్ నెలలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల 25 వేల మంది సైనికులు చనిపోయారని.. ఇప్పటికైనా యుద్ధం ఆపాలంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ట్రంప్.
రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తక్షణమే వదులుకోవాలని సూచించారు ట్రంప్. ఈ మారణ హోమాన్ని ఆపాలనుకుంటున్నా. గత నెలలో 25 వేల మంది చనిపోయారు. యుద్ధాన్ని ఆపేందుకు మేము చాలా కష్టపడుతున్నాము.. అని అన్నారు ట్రంప్.
ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఎప్పుడో చెప్పా. ఎవరికి వారు ఇలా ఆటలు ఆడుతుంటే.. ఇది మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. అలా జరగితే మేము చూస్తూ ఉరుకోము అంటూ హెచ్చరించారు
మాటలు కాదు.. యాక్షన్, రిజల్ట్స్ కావాలి:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ప్రసిడెంట్ ట్రంప్ అసహనంతో ఉన్నారని వైట్ హైస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తుటే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ రెండూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటం లేదని.. ఏదో సమావేశం కావాలి కాబట్టి మీటింగ్ కు వచ్చినట్లు ఉందని విమర్శించారు.
ఇప్పటి వరకు జరిగిన మీటింగ్స్ ఏమీ సాధించలేదు. మాటలు, చర్చలు కాదు.. ఫలితాలు కావాలని ట్రంప్ చెప్పినట్లు తెలిపారు. నాలుగేళ్లుగా జరుగుతన్న యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా మొదటి నుంచీ కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పుడు ఆయనకు మీటింగ్స్ పై ఆసైక్తి లేదు.. ఓన్లీ యాక్షన్.. రిజల్ట్స్ కావాలని చెప్పారు.
యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ కు సహాయం చేస్తామని చెప్పామని ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు సెక్యూరిటీ అగ్రీమెంట్ ఏర్పాటు చేసుకుందామని.. అందుకు సాయం చేస్తామని చెబితే.. ఆ దేశ ప్రసిడెంట్ జెలెన్ స్కీ.. అమెరికాతో ఒప్పందానికి రాలేదు. యూఎస్ తో ఒప్పందం చేసుకుందామన్న అధికారులతపై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచినట్లు తెలిపారు.

