హైదరాబాద్, వెలుగు: ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా.. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐఆర్ఐఏ సదస్సులో సరికొత్త డయాగ్నస్టిక్ ఇమేజింగ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో ఎఫ్‌సీటీ ఐస్ట్రీమ్ సీటీ ప్లాట్‌ఫారమ్, సోఫినిటీ డిజిటల్ మామోగ్రఫీ ఎఫ్డీఆర్, స్మార్ట్ ఎక్స్ ఎసెన్షియల్ ఎక్స్‌రే సిస్టమ్స్ ఉన్నాయి.
హెల్త్‌కేర్, ఐటీ రంగాల కోసం ఫెనిక్స్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను కూడా పరిచయం చేసింది. పెరుగుతున్న రోగుల రద్దీని తట్టుకోవడానికి రేడియాలజీ విభాగాలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. ఏఐ ఆధారిత పనితీరు వల్ల రోగులకు తక్కువ రేడియేషన్ తోనే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని ఫ్యూజీ ఫిల్మ్ పేర్కొంది.
