పెద్ద టీవీలకు ఫుల్ గిరాకీ

పెద్ద టీవీలకు ఫుల్ గిరాకీ

సప్లయ్‌ను మించిన డిమాండ్

పెరుగుతున్న పెద్ద స్క్రీన్ టీవీల అమ్మకాలు
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో మరింతగా సేల్స్ జోరు

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: లాక్‌‌డౌన్‌‌తో ఇళ్లకు అతుక్కుపోయిన ప్రజలకు టీవీనే ప్రధాన ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌గా మారింది. దీంతో అప్పటి వరకు టీవీలు లేని వారు టీవీలు కొనడానికి, చిన్న టీవీలు ఉన్నవారు పెద్ద టీవీలు కొనడానికి ఆసక్తి చూపడం మొదలైంది. ఫలితంగా అన్‌‌లాక్‌‌ ప్రారంభమైనప్పటి నుంచి టీవీలకు డిమాండ్ భారీగా పెరిగింది. టీవీల అమ్మకాలు విపరీతంగా సాగుతున్నాయి. సప్లయ్‌‌‌‌‌‌‌‌కు మించి డిమాండ్ ఉందని, టీవీల స్టాక్‌‌‌‌‌‌‌‌ సరిపడినంత లేకపోవడంతో అమ్మకాలు జరపలేకపోతున్నామని వివిధ టీవీ తయారీ కంపెనీలు అంటున్నాయి. దేశంలో టీవీలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువ టైమ్ ఉండాల్సి రావడం, వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌ హోం విధానం పుంజుకోవడంతో ఈ ఏడాది స్మార్ట్‌‌‌‌‌‌‌‌ టీవీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సినిమా థియేటర్లు బంద్‌‌‌‌‌‌‌‌లో ఉండడంతో ఇళ్లల్లోనే థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ను చాలా మంది కోరుకుంటున్నారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ టీవీల ద్వారా ఓటీటీ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసుకునే వీలుండడంతో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ టీవీలకు ఎక్కువ గిరాకీ ఉంది. ఈ ఏడాది లార్జ్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్స్‌‌‌‌‌‌‌‌(50 ఇంచులకు పైన) టీవీలకు ఎక్కువ డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని పానసోనిక్ పేర్కొంది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌, వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌ హోం, థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గడం వంటివి టీవీల అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయని తెలిపింది.

32 ఇంచుల టీవీకి డిమాండ్‌‌‌‌‌‌‌‌..

దేశంలో టీవీల తయారీని  పెంచేందుకు ఈ ఏడాది ప్రారంభంలో కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీల దిగుమతులపై ప్రభుత్వం రెస్ట్రిక్షన్లను విధించింది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 781 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీలను ఇండియా దిగుమతి చేసుకుంది. ఇందులో వియత్నాం నుంచి 428 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల విలువైన టీవీలను, చైనా నుంచి 292 మిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్ల విలువైన టీవీలను ఇండియా దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్ మధ్య కాలంలో టీవీల అమ్మకాలు 25 శాతం పెరిగాయని వీడియోటెక్స్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్జున్‌‌‌‌‌‌‌‌ బజాజ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ కంపెనీ ఇతర టీవీ బ్రాండ్లను తయారు చేయడంతో పాటు, షిన్కో, టెలిఫంకెన్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్లతో తన సొంత టీవీలను అమ్ముతోంది. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీవీల అమ్మకాలు సమానంగా ఉన్నాయని బజాజ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. 32 –49 ఇంచుల స్క్రీన్‌‌‌‌‌‌‌‌ సైజ్ ఉన్న టీవీలకు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. కానీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ప్యానల్స్‌‌‌‌‌‌‌‌ ధరలు విపరీతంగా పెరిగాయని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం చిన్న ప్యానెల్స్‌‌‌‌‌‌‌‌ ధరలే 100 శాతం పెరిగాయని చెప్పారు. దేశంలో  వీడియో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ వినియోగం పెరిగిందని, మొబైల్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి పెద్ద స్క్రీన్ టీవీలకు కన్జూమర్లు అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ అవుతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు.

తక్కువగా టీవీల సప్లయ్‌‌‌‌‌‌‌‌..

దేశంలో టీవీలకు డిమాండ్ పెరుగుతున్నా సప్లయ్‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. టీవీల దిగుమతులపై ప్రభుత్వం నియంత్రణలు విధించడంతో వీటి డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గ సప్లయ్‌‌‌‌‌‌‌‌ లేదని పేర్కొంటున్నారు. టీవీల తయారీలో కీలకంగా ఉండే ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ ధరలు ఈ ఏడాది 60 శాతానికి పైగా పెరిగాయని టీవీ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌గా వీటి తయారీ తక్కువగా ఉందని, వీటి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నాయి. ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ప్యానల్స్‌‌‌‌‌‌‌‌ దిగుమతులపై 5 శాతం కస్టమ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీని గత నెల 1 నుంచి ప్రభుత్వం విధించింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ టీవీల డిమాండ్ సప్లయ్‌‌‌‌‌‌‌‌కు మించి ఉందని పానసోనిక్ పేర్కొంది.  ప్రస్తుతం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో టీవీల సప్లయ్‌‌‌‌‌‌‌‌లో షార్టేజ్‌‌‌‌‌‌‌‌ ఉందని తెలిపింది.  దీపావళి దగ్గరపడుతుండడంతో రానున్న 2 వారాలు కీలకమని పేర్కొంది. ఫెస్టివ్‌‌‌‌‌‌‌‌ సీజన్ కావడంతో టీవీలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా కనిపిస్తోందని, కానీ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరగడంతో టీవీల సప్లయ్‌‌‌‌‌‌‌‌ తగ్గిందని థామ్సన్‌‌‌‌‌‌‌‌ టీవీ ఇండియా తెలిపింది. వచ్చే ఏడాది క్యూ1 వరకు ప్యానల్‌‌‌‌‌‌‌‌ ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ సేల్స్ 75 శాతం పెరిగాయని థామ్సన్ ఇండియా తెలిపింది.

For More News..

ఉద్యోగులకు దీపావళి కానుకిస్తున్న కంపెనీలు

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌‌ దక్కించుకున్న హైదరాబాద్