కరోనాతో ఆన్ లైన్ గేమ్స్ కు పెరిగిన గిరాకీ

కరోనాతో ఆన్ లైన్ గేమ్స్ కు పెరిగిన గిరాకీ

కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. చాలా దేశాలలో కరోనా ప్రభావిత ప్రాంతాలు షట్‌‌డౌన్ అయ్యాయి. ఇంట్లో నుంచి జనం బయటికి అడుగు పెట్టడం లేదు. దీంతో చాలా వరకు వ్యాపారాలు స్తంభించాయి. గ్లోబల్‌‌గా సప్లయి చెయిన్‌‌కు అంతరాయం ఏర్పడింది. ఇన్ని సమస్యలు సృష్టిస్తోన్న కరోనా వల్ల.. ప్రయోజనం పొందిన వ్యాపారాలూ కొన్ని ఉన్నాయి.  అవేంటంటే,  ఆన్‌‌లైన్ గేమ్స్, షార్ట్ వీడియో యాప్స్‌‌. ఇళ్లకే పరిమితమవుతున్న జనం.. ఎంచక్కా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ కోసం ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌, షార్ట్‌‌ వీడియోస్‌‌ను ఆస్వాదిస్తున్నారు. ఆన్‌‌లైన్ గేమ్సయితే తెగ ఆడేస్తున్నారు.  షార్ట్ వీడియో యాప్స్‌‌లోనూ కంటెంట్‌‌ చూసేస్తున్నారు. ఆన్‌‌లైన్ గేమ్స్‌‌కు, షార్ట్ వీడియో యాప్స్‌‌కు లక్షల కొద్దీ వ్యూస్‌‌ రావడంతోపాటు, గేమ్స్‌‌, షార్ట్‌‌ వీడియో యాప్స్‌‌  డౌన్‌‌లోడ్స్‌‌ విపరీతంగా పెరిగాయి. గ్లోబల్‌‌గా మొబైల్ గేమ్ డౌన్‌‌లోడ్స్‌‌ ఫిబ్రవరిలో 39 శాతం పెరిగినట్టు యాప్ అనలటిక్స్ సంస్థ సెన్సర్ టవర్ తెలిపింది. బ్రెయిన్ అవుట్‌‌ వంటి పజిల్ గేమ్స్, టెన్సెంట్ ఆన్‌‌లైన్ గేమ్ ‘ఆనర్ ఆఫ్ కింగ్స్‌‌’ చైనాలో మోస్ట్ డౌన్‌‌లోడెడ్‌‌ గేమ్‌‌గా ఉన్నట్టు మొబైల్ యాప్ అనలటిక్స్ సంస్థ యాప్ చెప్పింది. ఆసియా మార్కెట్‌‌లో మొత్తంగా పబ్‌‌జీను ఎక్కువగా ఆడేస్తున్నారు. మొబైల్ గేమ్ డౌన్‌‌లోడ్స్‌‌ గ్లోబల్‌‌గా ఏకంగా 400 కోట్లను తాకింది. అంతకుముందు ఇవి 290 కోట్లుగా ఉన్నాయి. వీటిలో ఒక్క ఆసియా షేరు 46 శాతం జంప్ చేసింది.  ఆసియా నుంచి 160 కోట్ల గేమ్స్​ డౌన్‌‌లోడ్స్‌‌ అయ్యాయని సెన్సర్ టవర్ డేటా పేర్కొంది.

చైనాలో లునార్ న్యూ ఇయర్ సందర్భంగా మొదలైన హాలిడేస్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.  కరోనా భయానికి  జనవరి మధ్య నుంచి కొంత మంది తమ ట్రావెల్‌‌ ప్లాన్స్‌‌ను వాయిదా వేసుకుంటే మరి కొంత మంది రద్దు చేసుకున్నారు. ‘సాధారణంగా ఆఫీసు ఉన్న సమయంలో నేను నా మొబైల్‌‌ను రోజుకు మూడు గంటలు మాత్రమే ఉపయోగిస్తా. కానీ ఫెస్టివల్ హాలిడే పొడిగించడంతో,ఇంట్లో ఏం చేయాలో తోచక రోజుకు ఎనిమిది గంటల పాటు మొబైల్‌‌ను వాడుతున్నా’ అని ఈస్ట్రన్ షాన్‌‌డాంగ్ ప్రావిన్స్‌‌ను చెందిన జూనియర్ హై స్కూల్ టీచర్ లు జాంగ్ చెప్పారు. ఈ ట్రెండ్‌‌ను ఇన్వెస్టర్లు కూడా అందిపుచ్చుకుంటున్నారు. టెన్సెంట్ లాంటి చైనీస్ గేమ్ పబ్లిషర్స్ కంపెనీల షేర్లు హాంకాంగ్ ఇండెక్స్‌‌లో పెరిగాయి. అమెరికాలో లిస్ట్ అయిన చైనీస్ వీడియో ప్లాట్‌‌ఫామ్ బిలిబిలి షేర్లు 7 శాతం వరకు పెరిగాయి. సెర్చ్ ఇంజిన్ కంపెనీ బైదు, ఈకామర్స్ కంపెనీ అలీబాబా షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి.  గేమ్స్‌‌  డెవలప్మెంట్‌‌లోని అయిదు కంపెనీల షేర్లు గరిష్టంగా 10 శాతం వరకు పెరిగాయి. ఆన్‌‌లైన్ వీడియో గేమ్స్, షార్ట్ వీడియో యాప్స్‌‌తో పాటు హెల్త్‌‌, ఫిట్‌‌నెస్ యాప్స్‌‌కు కూడా పాపులారిటీ పెరిగింది.